Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జారిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి.. కూలిన స్టాక్ మార్కెట్లు

దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపి) వృద్ధి ఫిబ్రవరిలో గణనీయంగా పడిపోయింది. జనవరిలో 4.3శాతంగా ఉన్న ఐఐపి వృద్ధి ఫిబ్రవరిలో 0.6శాతానికి క్షీణించింది. 2012 ఫిబ్రవరిలో ఇది 4.4శాతంగా ఉండడం గమనార్హం. మౌలిక వసతుల రంగంలో వృద్ధి తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం వెల్లడించింది. తయారీ రంగ వృద్ధి కూడా జనవరిలో ఉన్న 2.7శాతం నుంచి ఫిబ్రవరిలో 2.2శాతానికి తగ్గింది. మొత్తం మీద 2012 ఏప్రిల్ నుంచి 2013 ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో పారిశ్రామికోత్పత్తిలో 0.9శాతం పెరుగుదల ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఐఐపి గణాంకాలు బలహీనంగా ఉండడం, ఇన్ఫోసిస్ ఫలితాలు వెలవెల బోవడవం స్టాక్ మార్కెట్లపై భారీగా ప్రభావం చూపించాయి. మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.

More Telugu News